నా ఈ కొత్త బ్లాగు హిట్టా...ఫట్టా....?  

Posted by mahigrafix

జాజిపూలు, మల్లెపూలు, చామంతిపూలు, మా అమ్మ కధలు-కబుర్లు, చందమామ, బాలమిత్ర...ఇలాంటి బ్లాగులన్నీ ఈ మధ్యే చూస్తున్నాను...

ఒకప్పుడు పానుగంటి, మధుబాబు, సూర్యదేవర, ఎండమూరి నవలలు పిచ్చ పిచ్చగా చదివేవాణ్ని...

ఎలా చదివే వాణ్నంటే చివరకు అన్నం తినేటపుడు కూడా ఒక చేతిలో నవల ఖచ్చితంగా ఉండాల్సిందే..

సీరియస్ హీరో షాడో, సీరియస్ అండ్ కామెడీ హీరో బుల్లెట్, సైడ్ కామెడీ హీరో గంగారాం క్యారెక్టర్ లను ఎప్పటికీ మర్చిపోలేను.

వాళ్ల నవలలు చదువుతుంటే నా కళ్ల ముందు ఉన్నవి కనపడవు. నవలలోని సన్నివేశంలో నేనూ ఒక క్యారెక్టర్ నైపోయే వాణ్ని.

నన్ను నేను మర్చిపోయేవాణ్ని... చివరకు క్యారెక్టర్స్ ను క్రియేట్ చేసిన పానుగంటి, మధుబాబులను కూడా మర్చిపోయేవాణ్ని.

నేనే షాడో, నేనే బుల్లెట్ అన్న ఇమాజినేషన్ లోకి తెలియకుండానే వెళ్లేవాణ్ని. వాళ్ల రచనల పవర్, రాసిన విధానం అలాంటిది.

ఇన్ని రోజుల నా ఆలోచనలను ఎవరకి చెప్పాలో అర్థంకాక సతమతమయ్యేవాణ్ని. ఈ బ్లాగులు చూసిన తర్వాత నాకు మార్గం దొరికింది.

ఇక నుంచి ఈ బ్లాగులో....నేను క్రియేట్ చేసిన కథలు, నా కలలు లాంటివి రాద్దామనుకుంటున్నాను.

ఇదే విషయాన్ని మా ఫ్రెండ్ కు చెప్పాను.

"మరి కథలు చెప్పే అన్ని సూపర్ హిట్ బ్లాగులున్నాయి కదా. మరి నీ బ్లాగు యావరేజ్ హిట్ అయినా అవ్వుద్దంటావా?" అని మా ఫ్రెండ్ కొచ్చెన్ వేశాడు.

"అబ్బాఁ! వీడు మొదట్లోనే నాకు ఇంట్రెస్ట్ పోగొడ్తున్నాడు." అని మనసులో తిట్టుకుంటూ "ఒరేయ్! మహేష్ గాడు ఏదైనా మొదలు పెట్టాడంటే అది సూపర్ హిట్టే" అన్నాను కొంచెం ప్రౌడ్ గా

"అవునురా! ఒక్కడు సినిమా చూసినప్పుడే అనుకున్నాను. మహేష్ కు పోకిరి లాంటి సూపర్ హిట్ సినిమా త్వరలోనే వస్తుందని"

నాకు సర్రని కాలింది వాడి సెటైర్ కి.

"కంట్రోల్..కంట్రోల్" అనుకుంటూ "రేయ్! నేను చెప్పింది ఆ మహేష్ గురించి కాదురా! నా గురించి! అన్నాను కూల్ గా.

"ఓహ్! నీ పేరు కూడా మహేషే కదా!.. సరే ఇంతకీ నీ బ్లాగులో ఏ టైప్ కథలు రాద్దామనుకుంటున్నావ్!"

"హర్రర్ అండ్ సస్పెన్స్ స్టోరీస్ రాద్దామనుకుంటున్నాను"

"ఒరేయ్ ఈ రోజుల్లో అవెవరు చదువుతారు. మిగిలిన బ్లాగుల్లాగ మంచి కథలు రాయరా బాబు"

"ఎందకు చదవరూ.. చదువతారు..అసల్ హర్రర్ లైక్ చేసేవాళ్లు.. ఆ కథలలోని సస్పెన్స్ ను, థ్రిల్లింగ్స్ ను , ట్విస్ట్ లను ఎంజాయ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఉదా:కు మీ తమ్ముడు" అన్నాను ఒకింత ఆవేశంగా.

"ఇదన్నమాట కథ! వాడు ప్రతి రోజూ రాత్రి నిద్రలో గట్టిగా మంత్రాలు చదువుతుంటే....ఇప్పుడర్థమయ్యింది. వాణ్ని నువ్వే ఇలా కథలు చెప్పి భయపెడుతున్నావన్న మాట" అన్నాడు కోపంగా..

"అదేం లేదురా బాబు. ఇంతవరకు నేను వాడికి ఒక్క కథ కూడా చెప్పలేదు. వాడే మొన్న ఇంటికి వచ్చి..."

"ఆఁ వచ్చి!"

"చూడు నీకే తెలుస్తుంది" అని ఫ్లాష్ బ్యాక్ ను వాడి కళ్ల ముందు ప్లే చేశాను.

"మహేషన్నా...నాకు మూవీ డీవీడీలు కావాలి"

"ఏవి కావాల్రా? నా దగ్గరైతే 'నువు నాకు నచ్చావ్', 'మన్మధుడు' ఉన్నాయి"

"నాకవేమీ వద్దన్నా! నాకు అవి కావాలి" అన్నాడు కన్ను కొడుతూ.

"అవంటే ఏవిరా. డైరెక్ట్ గా చెప్పు" మనసులో ఎక్కడో చిన్న అనుమానం.

"అవే..అన్నా! నీకు తెలుసుగా నాకు అవంటే ఇష్టమని"

ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వాడితో గడిపిన సీన్ లన్నీ తిరిగి వచ్చాను. వాడు చెప్పింది ఎక్కడా మ్యాచ్ కాలేదు..

"నాకైతే గుర్తుకు రావట్లేదురా నీకేమిష్టమో? నువ్వే చెప్పు"

"అవీ..అవీ.." మళ్లీ కన్నుకొట్టాడు.

నాకెందెకో నా అనుమానం నిజమేనేమోననిపించింది. కుర్చిలో ఒక రౌండ్ గిర్రున తిరిగి వాడు ముందు నిలబడ్డాను.

"ఇపుడు చెప్పరా...డైరెక్ట్ గా చెప్పు..నా సహనాన్ని పరీక్షించొద్దు" అన్నాను ఒకింత సీరియస్ గా

"అదే అన్నా మనం హైద్రాబాద్ వెళ్లినపుడు.. నిన్ను బతిమాలి 'దెయ్యాలకోట' సినిమాకు తీస్కువెళ్లాను కదా. గుర్తుకు రాలేదా..ఇపుడు నేను అడిగేది కూడా అలాంటి హర్రర్ సినిమాలే"

ఒక్క సారి హుఫ్ అని ఊపుకుని, వాడు అడిగిన సినిమాలు ఇచ్చి పంపించాను.

"ఇదిరా! మీ తమ్ముడికీ నాకూ జరిగిన స్టోరి..అంతకు మించి నేను హర్రర్ కథలెప్పుడూ చెప్పలేదు."

"సరేలే..ఇంతకీ ఇప్పటి నుంచి బ్లాగు రీడర్స్ ను భయపెడదామనుకుంటున్నావన్నమాట"

"నేను భయపెట్టాలనుకోవట్లేదురా..వాళ్లకు సమ్ థ్రిల్ ఇవ్వటానికి నా ప్రయత్నం నేను చేద్దామనుకుంటున్నాను"

"ఇంతకీ ఇలాంటి థ్రిల్లర్ స్టోరి బ్లాగ్స్ ఆల్రెడీ ఉన్నాయా? నీదే మొదటి బ్లాగా?"

"తెలియదురా! ఒక వేళ ఉన్నా కూడా నా వే ఆఫ్ ప్రజెంటేషన్ నేను మైన్ టైన్ చేస్తాను"

"సర్లే ట్రై చేయి..ఒక వేళ హిట్ కాకపోతే ఫీలయ్యి సుసైడ్ లాంటివేమీ చేస్కోకు.."

"ఒరేయ్ నాకు లేని ఆలోచనలు తెప్పించకు...అసలు ఇలాంటి బ్లాగు పెడ్తున్నాని నీకు చెప్పాను చూడూ..నన్ననాలి"

"రీడర్స్ నీ కథలు చదువుతుంటేనే వాళ్ల కళ్ల ముందు, నీ కథల లోని సీన్స్ సినిమాలా ప్లే అవ్వాలి. అలా రాయటానికి ట్రై చేయ్. వ్రాసేటపుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్నడుగు. సరేనా!"

మనసులో నా మీద నాకే జాలేసి నవ్వుకున్నాను.. "ఓకే రా! నాకు మంచి అడ్వైజ్ ఇచ్చినందుకు థాంక్స్.. ఓకే నా ఉంటాను మరి."

"వ్రాయ్ మామా! నీకెందుకు. నీ బ్లాగులోని కథలు నేను చదువుతాను. అలాగే నాకు తెలిసిన అందరికీ చదవమని చెప్తాను." ఇదీ నేను వాడి దగ్గరి నుంచి ఆశించిన మాట.

చివరకు ఏమైనా డౌట్ ఉంటే నన్నడగమని వాడి అడ్వైజ్.

మీకు అసలు విషయం చెప్పమంటారా. అసలు వాడికి వాడిపేరే వ్రాస్కోవడం సరీగా రాదు. 10 వ తరగతి పరీక్షల్లో నేను కనీసం కథలైనా వ్రాసాను. వాడు.. అసలు ఎక్జామే వ్రాయలేదు. పేపర్ మీద పెన్ను పెట్టాలన్న భయంతో..

This entry was posted on Wednesday, March 04, 2009 at Wednesday, March 04, 2009 . You can follow any responses to this entry through the comments feed .

15 comments

మహీ గారు బాగుంది అండీ. ఏమి పరవాలేదు ఎటువంటి డవుట్స్ పెట్టుకోకుండా రాసేయండి . కానీ జనాలను మరీ భయపేట్టెయకండీ. Hittttttttttttttttee అవుతుంది.
We are waiting. Go a head. All the Best.

March 4, 2009 10:30 PM

మహేష్ గారు మీలోని మరో కోణాన్ని వెలికితీసే ఈ బ్లాగు ద్వారా మీరు పంచుకోబోయే కధలు, సన్నివేశాలను చదవాలన్న ఆసక్తి మీ ఇంట్రడక్షన్ చదవగానే కలుగుతోంది. చాలా మంచి శైలి మీది. ఈ బ్లాగు విజయం తధ్యం.

March 5, 2009 6:05 AM
Ananth  

wow...!!!!
I am really interested in horror and thrilling stories...
veetiki LIFE climax..
so climax chala goppaga undetattu rayandi..

i really appreciate whole heatedly for writing these type of blogs..

na browser lo mee book marks ekkuva meeve unnai ante nammandi..
sridhar garu chala goppavaru..vaaru annattu me life loni maro side ni chupisthunnaru.. HATS OFF
vaariki me sahayam thodu iythe..inka KEKAAAAA.

anyway..
me okka blog oka milestone la undipothundi...

ALL THE BEST MY BROTHER......

GO AHEAD --->>>>>>>>>>>>>>>>>>>>>

March 5, 2009 8:22 AM

మహేష్ గారు,
మీ రచనాశైలి మాత్రం సూపర్ . ఇలాగే కంటిన్యూ ఐపోండి. మొదటి కధ చదవడానికి ఎప్పుడు రమ్మంటారు మీ బ్లాగుకు...

March 5, 2009 10:52 AM

మహేష్ గారూ ! మళ్ళీ నేను ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళేలా చేశారు .కధలన్నింటిలో సస్పెన్సు కధలు వేరయా ........అన్నారు కదండీ ( ఎవరని అడక్కండి ...నాకూ తెలీదు మరి ) కనుక ఇక మొదలు పెట్టండి మీ కధా కదంబం .all the best!

March 6, 2009 10:43 AM
స్వాతి  

మహేష్ గారు మీ బ్లాగ్ చూస్తుంటే మీ మహీగ్రాఫిక్స్ పేరు లాగా మీరు మాటలతోనే గ్రాఫిక్స్ చేస్తున్నట్లు ఉంది. ఇంకా మీలో ఉన్న అన్ని కోణాలను బయట పెట్టండి సార్. మీ ఆలోచనలకు, రచనలకు, కవితలకు తిరుగులేదు. ఇకపోతే మీ బ్లాగ్ హిట్టా ఫట్టా అని పెట్టారు. భలే ఫన్నిగా ఉంది. కాని మీ బ్లాగ్కి ఆ ఆలోచన అక్కర్లేదు. మీరు ఏమి చేసినా హిట్టే. ఇంక ఇప్పుడు మీ నుంచి బ్లాగ్ వీక్షకులు ఇటువంటి బ్లాగ్లను కూడా ఎక్కువగా కోరుకుంటారు. సో మీరు హిట్టా ఫట్టా ఆలోచించకుడా కంటిన్యూ అయిపోండి. ఈ బ్లాగ్ ఎప్పటి నుండో మీ కలలను, ఊహ అన్నారు. చాలా బాగుంది. మరిన్ని పోస్లులు కూడా చేయండి. ఏది ఏమైనా మీ అన్ని బ్లాగ్స్ లాగా మీ ఈ కొత్త బ్లాగ్ కూడా మరింత విజయవంతం కావాలని కోరుకుంటా... మీకు ‘‘All The Best”

March 6, 2009 8:38 PM

మహిగారూ,
మీరేం చేసినా హిట్టే గాని ఫట్టయ్యే కొశ్చనే లేదు.చదివించే శైలిమీది. మీరిచ్చిన ఇంట్రడక్షన్ని బట్టి మంచి కామెడీ కూడా పండించగలరనిపిస్తోంది. ఇక సస్పెన్స్,థ్రిల్ నిండిన కథల కోసం అందరం ఎదురుచూస్తున్నాం. గబ గబా రాసేయండిమరి.

March 8, 2009 7:51 AM
This comment has been removed by the author.
March 25, 2009 1:55 AM

I am very much interested your way of writing stories... Go Ahead ..
All the best

www.virtusolutions.co.in

March 25, 2009 1:57 AM
Anonymous  

మహెష్ గారు బ్లాగుల ప్రపంచంలో కొంతమంది తాత్కలిక బ్లాగర్ల వల్ల మంచి బ్లాగులకి ఆదరణ తగ్గుతుంది......అందున మీ లాంటి సహయపడే మనిషి కొత్త బ్లాగు సస్పెన్స్ & థ్రిల్లింగ్ స్టోరీస్ తెలుగు లో తీసుకువస్తె ఏందుకు హిట్టు కాకుండా ఉంటుంది......మీరు విజయవంతంగా వ్రాయండి....మీ బ్లాగునీ నేను నా మిత్రులకు పరిచయం చేస్తాను.....arjun (acpkmm@gmail.com

April 29, 2009 2:34 PM

సునీల్ స్టైల్లో చెప్పాలంటే 'పదహారొందలమంది వెయిటింగిక్కడ '. నాకసలే హర్రర్ సినిమాలన్నా, దెయ్యం కథలన్నా చ............చ్చేంతిష్టం. త్వరగా వ్రాసెయ్యండి.

April 29, 2009 5:45 PM

నాతో పాటు కలిపి పదహారొందల ఒక్కమంది వెయిటింగిక్కడ!

ఈ మధ్య హారర్, సస్పెన్స్ స్టొరీలు న్యూస్ ఛానెళ్ళ క్రైం స్టోరీల్లో తప్ప ఎక్కడా రావడం లేదు.(వాటిని మనం కామెడీ కళ్ళతో చూడాలి) మీకిక్కడ బోలెడంత మంది పాఠకులు రెడీ! మీ ఇంట్రడక్షనే అదిరింది. మొదటి భాగం ఎప్పుడు? రేప్పొద్దున్నేగా? సరే ఐతే!

April 29, 2009 6:33 PM

అదే మరి. మడిసన్నాక కూసంత కలాపోసణ ఉండాలన్నారుగానీ...మరీ ఇంత ఇదా...?? అబ్బో ఏంసెప్పారండీ...బాబూ ఏంసెప్పారండీ. నిద్రలో కూడా బయపెట్టేసేత్తారేంటీ కొంపదీసి. అలాజేయబాకండి బాబై. మెల్కువగా ఉన్నా కూడా భయపేట్టేసే.......యండి. సరేనా. ఇగ ఉంటా. మా సెగట్రీ ఫోన్ మాట్లాడాలి. మీ నుంచి మరో పోస్ట్ వచ్చేదాక కూసంత విరామం. సరేనా.

May 17, 2009 10:53 AM

we are interested to read your stories sir.. when are you startig your blog?

June 14, 2009 6:11 PM
Anonymous  

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49

August 25, 2009 1:49 PM

Post a Comment